- హాజరుకానున్న దీపాదాస్ మున్షి, మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివారులోని కీసర వద్ద బుధవారం నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ ఇందిరా ఫెలోషిప్ బూట్ క్యాంప్ జరగనుంది. సమాజంలో కొత్త కొత్త మార్పులు తీసుకురావడంతో పాటు ఆధునాతనమైన పద్ధతిలో ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం వంటి పలు అంశాలపై ఈ మూడు రోజుల క్యాంపులో కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రసంగించనున్నారు.
ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి సీతక్క, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ జాతీయ నేతలు, అనుబంధ విభాగం నేతలు పాల్గొననున్నారు.