గుడ్న్యూస్..హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్

గుడ్న్యూస్..హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్

హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ త్వరలో ఏర్పాటు కానుంది. బుధవారం (డిసెంబర్4) GSEC ఏర్పాటుపై సైబర్ సెక్యూరిటీలో సీఎం రేవంత్ రెడ్డి  గూగుల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గత ఆగస్టులోనే GSEC ఏర్పాటుకు పునాది పడింది.. గత ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పెట్టుబడులుపెట్టేందుకు ఆహ్వానించారు. 

GSEC ఏర్పాటు అయితే దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంస్థ అవుతుంది. లేటెస్ట్ సెక్యూరిటీ, ఆన్ లైన్ సెక్యూరిటీ ప్రాడక్టుల డెవలప్ మెంట్ లక్ష్యంగా ఈ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఏషియన్ పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత హైదరాబాద్ లో GSEC ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది AI ఆధారంగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించే దిశగా బాటలు వేస్తున్నారు. 

Also Read:-రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు