ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని ప్రకటించింది. ఎగ్జామ్ సెంటర్ కు 8.45 గంటలకే చేరుకోవాలని సూచించింది. నిమిషం నిబంధనపై విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరీక్షకు ఆలస్యమయ్యాడనే కారణంతో అధికారులు అనుమతించకపోవడంతో ఫిబ్రవరి 29న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు.
ALSO READ :- Viral Video: వావ్... నెత్తిపై ఈత కొడుతున్న చేపలు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫిబ్రవరి 28న ప్రారంభమవ్వగా..సెకండియర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 29 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. మార్చి 18 వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి.