ఇంటర్ స్టూడెంట్లకు కోసం టెలీమానస్

ఇంటర్ స్టూడెంట్లకు కోసం టెలీమానస్
  • ఒత్తిడి నుంచి తప్పించేందుకు బోర్డు చర్యలు 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్​ విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ట్రాలలో టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్​ నెట్‌వర్కింగ్(టెలీమానస్) విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 14416 లేదా 1800-914416 నంబర్​కు కాల్ చేయాలని సూచించారు. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉచితంగా సేవలు అందిస్తారని వెల్లడించారు.  

మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 24 గంటలూ ఈ నంబర్లు పనిచేస్తాయన్నారు. వ్యక్తిగతంగానూ జిల్లా సర్కారు హాస్పిటల్స్​లో మెంటల్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీన్ని పేరెంట్స్, స్టూడెంట్స్ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.