
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో హవ్య సత్తా చాటింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఈ టోర్నీలో గర్ల్స్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్, 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లలో రన్నరప్‌గా నిలిచింది. 400 మీ. పోటీని 8 నిమిషాల 37 సెకండ్లలో, 100 మీటర్ల పోటీని 2 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసి రెండో స్థానం సాధించింది. బ్లూ డాల్ఫిన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న హవ్య.. ఈ నెల 30 నుంచి కర్నాటకలోని మాండ్యలో జరిగే సౌత్ జోన్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికైంది.