మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు

మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు
  • షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. మార్చి మొదటివారంలో పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి మూడో తేదీ నుంచి ఎగ్జామ్స్​ నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి అనుగుణంగా అధికారులు షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. మార్చి నెలాఖరులోగా ఈ పరీక్షలు పూర్తికానున్నాయి. మరోపక్క ఫిబ్రవరి ఫస్ట్ వీక్​లో ప్రాక్టీకల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షల షెడ్యూల్​కూడా తయారు చేస్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్, టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. దీంతో తెలంగాణ విద్యాశాఖ అధికారులు కూడా త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.