ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్

ఇంటర్ సెకండ్ ఇయర్  సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్  రిజల్ట్స్  రిలీజ్ అయ్యాయి.  ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఫలితాలు రిలీజ్ చేశారు. బాలికలు 53.59% , బాలురు 44.43% పాసయ్యారు.పాస్ పర్సెంటేజ్ లో ములుగు జిల్లా మొదటి స్థానం,  వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది.

ఎంసెట్ కౌన్సిలింగ్ ను దృష్టిలో ఉంచుకుని కేవలం సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేశామని ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. రీకౌంటింగ్ కోసం సెప్టెంబర్ 5 నుండి 8 వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 1.13లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.