తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మీడియం షెడ్యూల్ ను ఖరారు చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి మే 16వ తేదీ సోమవారం షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. తరగతుల ప్రారంభం, సెలవులు, పరీక్షల తేదీలను ఫిక్స్ చేసింది. మొత్తం 221 పని రోజులుంటాయని వెల్లడించింది. ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు జూలై 01, జూన్ 15 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 02 నుంచి అక్టోబర్ 09వ తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులుంటాయని, అలాగే 2023, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి హాలీడేస్ ఉంటాయేని తెలిపింది.
అలాగే ఫిబ్రవరి 06 నుంచి 13 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 06వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టీకల్స్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 04 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. 2023 ఏప్రిల్ 01 నుంచి మే 31 వరకు వేసవి సెలవులుంటాయని తెలిపింది. జూన్ 01వ తేదీ నుంచి కాలేజీలు ప్రారంభమౌతాయని పేర్కొంది. 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
మరిన్ని వార్తల కోసం : -
తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర!
కరాటే కళ్యాణికి నోటీసులు..స్పందించకుంటే చర్యలే