- ఇరిగేషన్ AEE కి డిసెంబర్ 13 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్
తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. ఆదివారం (డిసెంబర్ 1) న ఏసీబీ జడ్జీ ముందు హాజరు పర్చగా.. డిసెంబర్ 13వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ ఆదాయానికి మించిన ఆస్థులు సంపాదించినట్లు సమాచారం అందుకున్న అధికారులు నిఖేష్.. అతనిబంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. నిఖేష్.. రూ. 200 కోట్ల ఆస్తులను కలిగిఉన్నాడని గుర్తించిన అధికారులు వాటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.
Also Read :- చెన్నై ఎయిర్ పోర్ట్లో ఫ్లైట్కు తప్పిన ప్రమాదం
గండిపేట బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేశారని ఆరోపణలున్నాయి. నిఖేష్ పేరిట మూడు ఫామ్‌హౌస్‌లు, మూడు విల్లాలు.. మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ప్లాట్లతో పాటు .. మియాపూర్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నిఖేష్ సస్పెన్షన్‌లో ఉన్నారు. కాగా, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు శనివారం నిఖేష్ కుమార్, అతని బంధువులు, స్నేహితుల నివాసాల్లో సోదాల్లో జరిపారు.