వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మేనన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఫ్రీగా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. అంతేకాదు…దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రైతులకు పెట్టుబడి కింద రూ.10వేల రూపాయలు అందిస్తున్న ఘనత కేసీఆర్ దే నన్నారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు మంత్రి కేటీఆర్.
రాష్ట్రంలో ఒకప్పుడు 4 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములు ఉండేవన్నారు కేటీఆర్ ,తెలంగాణ వచ్చిన తర్వాత 25 లక్షలు నిల్వ సామర్థ్యం గోదాములు నిర్మించుకున్నమాని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు వేదికలు కేసీఆర్ మానస పుత్రిక అని… వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేనదుకు రైతు వేదికలు ఉపయోగపడతాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బీమా ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు. కరోనా సమయంలో 6600 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేశామని తెలిపారు మంత్రి కేటీఆర్.