టీకా పంపిణీలో ముందంజలో తెలంగాణ

టీకా పంపిణీలో ముందంజలో తెలంగాణ
  • చార్మినార్ యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
  • వేగంగా టీకా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
  • హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వాళ్లకు బూస్టర్ డోస్
  • మొదటి, రెండో డోస్ తీసుకున్న వాక్సిన్ నే మూడో డోస్ గా తీసుకోవాలి
  • రెండో డోస్ పూర్తయిన 9 నెలలకు బూస్టర్ డోస్: మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: కరోనా టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోమవారం చార్మినార్ యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్,  వైద్య శాఖ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వేగంగా టీకా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తొలి ప్రాధాన్యతగా హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వాళ్లకు బూస్టర్ డోస్ ఇస్తున్నామన్నారు. మొదటి, రెండో డోస్ తీసుకున్న వాక్సిన్ నే మూడో డోస్ గా తీసుకోవాలని, రెండో డోస్ పూర్తయిన 9 నెలలకు బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. 

ఇంగ్లీషు వైద్యంలో మందులు లేని వ్యాధులు సైతం యునాని వైద్యంతో నయం అవుతున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే లు మాకు మొదటి డోస్ సమయంలో చాలా సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. బూస్టర్ డోస్ , 15 ఏళ్ళు పై బడిన వారికి టీకా విషయంలో ను ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. టీకా విషయంలో ఎలాంటి సంశయాలు అక్కర్లేదు, ఎమ్మెల్యేలు సైతం టీకా తీసుకున్నారని వివరించారు. మొదటి డోస్ 102 శాతం పూర్తి అయిందని, కేవలం వారం రోజుల్లో 15 నుంచి 18 ఎల్లా మధ్య వారిలో 38 శాతం మందికి మొదటి డోస్ టీకా పూర్తి అయిందన్నారు. యునాని ఆస్పత్రిలో సమస్యలపై ఇప్పుడే చర్చించామని, అల్లోపతిలో సైతం కొన్ని వ్యాధులకు మందు ఉండదు కానీ యునాని వైద్య విధానంలో మెరుగైన సేవలు అందుతాయన్నారు. పక్షవాతం వంటి వాటికి చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం యునాని ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారని తెలిపారు. యునాని ఆస్పత్రిలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, అవసరం అయిన నిధుల అంశాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేస్తామన్నారు. 
యునాని ఆస్పత్రిలో ఖాళీల పూర్తి చేసేందుకు రెండు, మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని, ప్రొఫెసర్ లు సైతం మరింత సేవలు అందించాలన్నారు. ప్రస్తుతం  ఇన్ పేషెంట్ల సంఖ్య తక్కువగా వుందని, యునాని ఆస్పత్రిలో  ఇన్ పేషెంట్ల సంఖ్యని పెంచాలని మంత్రి కోరారు. రోగులకు వీలైనంత  వరకు ఇక్కడే సేవలు అందించాలని, ఉస్మానియాకి తప్పని పరిస్థితుల్లోనే రెఫర్  చేయాలన్నారు. 2 నెలల్లోనే ఇన్ పేషెంట్ల సంఖ్యని రెండు వందలకు పెంచుతామని  ఇక్కడి వైద్యులు హామీ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 6.6లక్షల మంది   ఫ్రంట్ లైన్ వర్కర్ లు ఉన్నారని వివరించారు. 

 

 

ఇవి కూడా చదవండి

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు

వర్క్​ ఫ్రమ్​ హోమ్..​ కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవే