నందిపేట, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్జనరంజక సంక్షేమ పథకాలు, పరిపాలన అందిస్తుండడం వల్ల నేడు తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్‌వన్‌లో ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నందిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ సైన్యం నేడు వేలల్లోకి చేరుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జీవన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు.
మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో అడుగడుగునా ప్రతికూల పరిస్థితులే ఎదురైనా కేసీఆర్ ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తుండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్ విఠల్‌రావ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ లో ఫైరవీలకు తావులేదని, కష్టపడ్డవారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం లేని నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ఆకుల లలిత, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, రాజారాం యాదవ్ మాట్లాడారు.