సోయాబీన్ సేకరణలో తెలంగాణ నంబర్ వన్ : శ్యామ్యూల్

  • డిపార్ట్ మెంట్ ఆఫ్​ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్పేర్ జాయింట్ సెక్రటరీ శ్యామ్యూల్

హైదరాబాద్​, వెలుగు: సోయాబీన్ సేకరణలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రిక్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ శ్యామ్యూల్ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో సోయాబీన్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ కు చెందిన వ్యవసాయ శాఖ కార్యదర్శులతో సోయాబీన్ సేకరణపై  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్యూల్  మాట్లాడుతూ.. ఇప్పటిదాకా రైతుల నుంచి మద్ధతు ధరతో సోయాను సేకరించిన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని తెలిపారు.

సోయాబీన్ సేకరణలో  మధ్యప్రదేశ్, మహారాష్ట్రలను అధిగమించిందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ కృషిని ఆయన అభినందించారు. తెలంగాణలో దాదాపు 47 సెంటర్లలో సోయా సేకరణ జరుగుతుందని చెప్పారు. 1453 మంది రైతుల నుంచి రూ.4,892 మద్దతు ధరతో ఇప్పటికి రూ.118.64 కోట్ల విలువైన 24,252 టన్నుల సోయాచిక్కుడును సేకరించినట్టు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి, మంత్రి ఆదేశాలతో గతంలో ఉన్న ఎకరా పరిమితి 6.5 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచడం జరిగిందని వెల్లడించారు.