గంగా జమునా తెహజీబ్​కు తెలంగాణ ప్రతీక

  •     ఇఫ్తార్​విందులో హోంమంత్రి మహమూద్​అలీ, రవాణా మంత్రి అజయ్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: గంగా జమునా తెహజీబ్​కు తెలంగాణ ప్రతీక అని, లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచామని రాష్ర్ట హోంమంత్రి మహమూద్ అలీ, రవాణామంత్రి పువ్వాడ అజయ్​కుమార్​అన్నారు. గురువారం నగరంలోని సీక్వెల్​ఫంక్షన్​హాలులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రులు మాట్లాడారు. విభిన్న మతాలు, భాషలు, రాష్ర్టాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునా తెహజీబ్​ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందన్నారు.

సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే రోల్​మోడల్​గా నిలిచాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రోగ్రాంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, నగర మేయర్​పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్​కుమార్, కలెక్టర్​వీపీ గౌతం, సీపీ విష్ణు వారియర్, కర్నాటి క్రిష్ణ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.