హైదరాబాద్, వెలుగు: ఐటీ కంపెనీ పీఎస్ఆర్ టెక్ హబ్ హైదరాబాద్ సైబర్ గేట్‌వే వద్ద నిర్మించిన గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను (జీసీసీ) రాష్ట్ర సమాచా ర సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఖాతాదారులకు ఇక్కడి నుంచే ఉత్పత్తులను, పరిష్కారాలను, సేవలను అందించడంలో ఇది కీలకమని కంపెనీ తెలిపింది.
2016లో మైక్రో సేల్స్ స్టార్టప్‌గా ప్రారంభం అయినప్పటి నుంచి, పీఎస్ఆర్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 220కిపైగా ఉద్యోగులు, ఎనిమిది సెంటర్లతో టెక్ హబ్‌గా అభివృద్ధి చెందింది.