హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ హబ్

 హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ హబ్
  • టీహబ్​లో మ్యాథ్​2024 ఇన్నోవేషన్ గాలా అవార్డుల ప్రోగ్రామ్​లో మంత్రి శ్రీధర్​బాబు

మాదాపూర్, వెలుగు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్​లు, టెక్నాలజీ కేపబిలిటీ సెంటర్​లతో హైదరాబాద్ గ్లోబల్​ టెక్నాలజీ హబ్​గా బలంగా స్థిరపడిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. రాబోయే రెండేండ్లలో ఈ సంఖ్య రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. గురువారం టీహబ్​లో మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ 2024 ఇన్నోవేషన్ గాలా అవార్డుల కార్యక్రమం జరిగింది. 

ఈ వేడుకల్లో ఏఐ అండ్ ఎంఎల్​లో జరిగిన పురోగతిని సెలబ్రేట్ చేస్తూ 10 విభాగాల్లో 16 స్టార్టప్ ఇన్నోవేటర్లను గుర్తించి సత్కరించారు. ఏఐ స్టార్టప్స్ కోసం ఎంఏటిహెచ్ ప్రత్యేకంగా ప్లాగ్​షిప్ మార్కెట్​ప్లేస్​ను ప్రారంభించినట్లు మ్యాథ్ సీఈఓ రాహుల్​పైత్ తెలిపారు. ఈ ఇన్నోవేషన్​ గాలా అవార్డులు గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్ 2024కు పునాదిగా నిలిచినట్లు తెలిపారు. సెప్టెంబర్ 4,5 తేదీల్లో మ్యాథాక్​2.0 పేరిట భారీ హ్యాకథాన్​ను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.