రాహుల్ సభకు కోఆర్డినేటర్ల నియామకం
హైదరాబాద్, వెలుగు : జులై 2న ఖమ్మంలో నిర్వహించనున్న రాహుల్ ‘తెలంగాణ జన గర్జన’ సభ బాధ్యతలను పార్టీ రాష్ట్ర నాయక త్వం నియోజకవర్గాల వారీగా నేతలకు అప్పగించింది. సభ కోఆర్డినేటర్‌గా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌ను, సహ కో ఆర్డినేటర్లుగా పొదెం వీరయ్య, పి.దుర్గాప్రసాద్, జనం తరలింపు కోఆర్డినేటర్లుగా సురేశ్ కుమార్ షెట్కార్, మల్లు రవి, ఒబేదుల్లా కొత్వాల్‌ను నియమిస్తూ శుక్రవారం ఆదేశా లిచ్చింది. నియోజకవర్గాల వారీగానూ కోఆర్డినేటర్లను నియమించింది.
సత్తుపల్లి కోఆర్డినేటర్‌గా ఎమ్మెల్యే సీతక్కకు, ఖమ్మం టౌన్ బాధ్యతలను సిరిసిల్ల రాజయ్య, రావి శ్రీనివాస్, మధిరకు వంశీ కృష్ణ, ఇల్లెందు బాధ్యతలను విజయ రమణారావుకు అప్పజెప్పింది. పాలకుర్తికి బండ్రు శోభారాణి, సూర్యాపేటకు నాయిని రాజేందర్ రెడ్డితో పాటు పలు సెగ్మెంట్లకు లీడర్లను అధిష్టానం నియమించింది.