గన్ మిస్ ఫైరింగ్‎తో తెలంగాణ జవాన్ మృతి

గన్ మిస్ ఫైరింగ్‎తో తెలంగాణ జవాన్ మృతి

గన్ మిస్ ఫైరింగ్ తో తెలంగాణకు చెందిన ఓ జవాను మృతిచెందాడు. ఒరిస్సాలోని రాయగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటనడా క్యాంపులో సీఆర్పీఎఫ్ జవాన్ గోవర్ధన్ (28) విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. గన్ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైరింగ్ అయింది. దాంతో గోవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. గోవర్ధన్ నిజామాబాద్ జిల్లా నవీపెట్ మండల కేంద్రము దర్యాపుర్ కాలనీకి చెందిన వ్యక్తి. గోవర్ధన్ మృతిని సిర్పీఎఫ్ అధికారులు వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటింబీకులు వచ్చిన తర్వాత వారి సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించి.. డెడ్ బాడీని అప్పగించారు. మంగళవారం స్వగ్రామంలో అంతిమ యాత్రను కొనసాగించి అధికార లాంఛనాల మధ్య దహన సంస్కారాలు చేశారు. గోవర్ధన్ అంతిమయాత్రలో గ్రామస్థులు పెద్ద ఎత్తున్న పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు.