ఉద్యోగార్థలకు ప్రత్యేకం..గ్రంథాలయోద్యమం..బిట్ బ్యాంక్

  •     1872లో సికింద్రాబాద్​లో సోమసుందర్​ మొదలియార్​ స్థాపించిన గ్రంథాలయం తెలుగు ప్రాంతాల్లోనే మొదటిది. 
  •     1872లో శంకర్​మఠ్​లో శంకరానంద, సికింద్రాబాద్​లో సార్వజనీక గ్రంథాలయాలను ముదిగొండ శంకరాచార్యులు స్థాపించారు. 
  •     అసఫియా స్టేట్​ లైబ్రరీని 1892లో స్థాపించారు. 
  •     1895లో శాలిబండలో భారత్​ గుణవర్థక్​ సంస్థ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 
  •     బొల్లారంలో అల్బర్ట్​ రీడింగ్​ రూంను 1896లో ఏర్పాటు చేశారు.
  •     గ్రంథాలయోద్యమానికి ఆద్యుడు, పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు. 
  •     మునగాల సంస్థానాధీశుడు నాయని వెంకటరంగారావు వద్ద కొమ్మర్రాజు లక్ష్మణరావు దివాన్​గా పనిచేశారు.
  •     నాయని వెంకటరంగరావు, రావిచెట్టు రంగారావులతో కలసి కొమర్రాజు లక్ష్మణరావు 1901లో హైదరాబాద్​లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 
  •     హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని 1904లో ఏర్పాటు చేశారు. 
  •     1905లో సికింద్రాబాద్​లో ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 
  •     1906లో విజ్ఞాన చంద్రికా మండలిని కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు ఏర్పాటు చేశారు. 
  •     తెలుగు ప్రాంతంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన మొదటి సంస్థ విజ్ఞాన చంద్రికా మండలి.
  •     కొమర్రాజు లక్ష్మణరావు రచించిన ఆంధ్రుల చరిత్రను విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించింది. 
  •     1910లో ఖమ్మంలో ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటు చేశారు. 
  •     1913లో వరంగల్​ జిల్లా మడికొండలో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటు చేశారు. 
  •     1913లో సికింద్రాబాద్​లో సంస్కృత కళావర్ధిని గ్రంథాలయాన్ని స్థాపించారు.
  •     1918లో హైదరాబాద్​లో రాజబహదూర్​ వెంకటరామిరెడ్డి చొరవతో రెడ్డి హాస్టల్​ గ్రంథాలయం ఏర్పడింది. 
  •     1924 నుంచి 1932 వరకు సురవరం ప్రతాపరెడ్డి రెడ్డి హాస్టల్​ గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేశారు. 
  •     వీర సావర్కర్ రచించిన వార్​ ఆఫ్​ ఇండిపెండెంట్స్​ అనే గ్రంథం రెడ్డి హాస్టల్​ గ్రంథాలయంలో ఉండటంతో సురవరం ప్రతాపరెడ్డి తన కార్యదర్శి పదవిని కోల్పోయారు. 
  •     గ్రంథాలయోద్యమకారుల కోసం సురవరం ప్రతాపరెడ్డి రచించిన గ్రంథం తెలంగాణాంధ్రుల కర్తవ్యం. 
  •     1918లో నల్లగొండలో ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం స్థాపించారు. 
  •     1918లో నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో ప్రజల సహకారంతో ఆంధ్ర ప్రకాశిని అనే గ్రంథాలయాన్ని పువ్వాడ వెంకటప్పయ్య అనే ఉపాధ్యాయుడు         స్థాపించాడు. 
  •     పువ్వాడ వెంకటప్పయ్య తెలుగు పుస్తకాల ముద్రణకు స్థాపించిన సంస్థ కృషి ప్రచారిణి గ్రంథమాల. 
  •     హైదరాబాద్​లోని అఫ్జల్​గంజ్​లో బాలసరస్వతి గ్రంథాలయాన్ని 1923లో ఏర్పాటు చేశారు. 
  •     1923లో కొండా వెంకటరంగారెడ్డి తన సొంత ఖర్చులతో వేమన ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటు చేశారు. 
  •     1923లో ఖమ్మంలో ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 
  •     1925లో ఆంధ్ర సోదరీ సమాజ గ్రంథాలయాన్ని హైదరాబాద్​లో ఏర్పాటు చేశారు. 
  •     1926లో ఆది హిందూ లైబ్రరీని బి.ఎస్​.వెంకట్రావు ఏర్పాటు చేశారు. 
  •     దక్కన్​ వైశ్య సంఘ గ్రంథాలయాన్ని 1926లో ఏర్పాటు చేశారు. 
  •     మెదక్​ జిల్లాలోని జోగిపేట గ్రంథాలయాన్ని 1930లో ఏర్పాటు చేశారు. 
  •     ఆంధ్రజన కేంద్ర సంఘం 1923 ఏప్రిల్​ 1న ఏర్పడింది. దీని మొదటి అధ్యక్షుడు బారిస్టర్​ రాజగోపాలరెడ్డి. మొదటి కార్యదర్శి మాడపాటి హన్మంతరావు. 
  •     ఆంధ్రజన కేంద్ర సంఘానికి అనుబంధంగా ఆదిరాజు వీరభద్రరావు సారథ్యంలో ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించారు. 
  •     ఆంధ్ర పరిశోధక మండలి ఆ తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు పేరుతో లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మారింది.
  •     ఆంధ్ర జన కేంద్ర సంఘం లక్ష్యాలు గ్రంథాలయాలను, పాఠశాలలను స్థాపించడం, తాళపత్ర గ్రంథాలను సేకరించి, చరిత్ర పరిశోధనలు జరిపి తెలంగాణ       వైభవాన్ని వెలుగులోకి తేవడం,   తెలుగుకు ప్రాచుర్యం కల్పించడం, కరపత్రాలను, పుస్తకాలను ప్రచురించి ప్రజలను చైతన్యవంతులను చేయడం.