తెలంగాణలో జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల చేసింది టీజీఎస్పీఎస్సీ. ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్టును టీజీఎస్ పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో ఉంచారు. ఈ పోస్టులకు ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాగా..మంగళవారం (అక్టోబర్ 22) సాయంత్రం తుది ఫలితాలను విడుదల చేశారు.
2022లో జేఎల్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 2023 లో పరీక్షలు నిర్వహించారు. 2024లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇవాళ(మంగళవారం) తుది ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు.