సాంస్కృతిక కళా ఉత్సవం: సింగిడి-2019

తెలంగాణ జానపదాలు, కళాకారుల తీన్మార్  స్టెప్పులతో వరంగల్ కాకతీయ యూనివర్శిటీ హోరెత్తింది. కేయూలో తెలంగాణ రాష్ట్ర శాఖ-రాష్ట్రీయ కళా మంచ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కళా ఉత్సవం సింగిడి-2019 నిర్వహించారు. తొమ్మిది రకాల జానపదగేయాలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించారు. వీటితో పాటు ముగ్గుల పోటీలు, జాతీయ భావాన్ని పెంపోందించే చిత్రాలు, పేయింటింగ్స్ నిర్వహించారు.