ఖో ఖో వరల్డ్‌‌ కప్‌‌ ఓపెనింగ్‌‌కు రావాలని సీఎంకు ఆహ్వానం

ఖో ఖో వరల్డ్‌‌ కప్‌‌ ఓపెనింగ్‌‌కు రావాలని  సీఎంకు ఆహ్వానం

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియా ఆతిథ్యం ఇస్తున్న తొలి ఖో ఖో వరల్డ్ కప్‌‌ ఈ నెల 13 నుంచి 19 వరకు ఢిల్లీలో జరగనుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే టోర్నీ  ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ ఖో ఖో సంఘం ఆహ్వానించింది.

. ఈ మేరకు ఖో ఖో  సంఘం అధ్యక్షుడు, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్‌‌  జంగా రాఘవ రెడ్డి  సోమవారం సీఎంకు ఇన్విటేషన్ అందించారు. ఈ కార్యక్రమంలో  ఖో ఖో సంఘం కార్యదర్శి  కృష్ణమూర్తి పాల్గొన్నారు.