క్వార్టర్ ఫైనల్​కు తెలంగాణ ఖోఖో టీమ్​

క్వార్టర్ ఫైనల్​కు తెలంగాణ ఖోఖో టీమ్​

తెలంగాణ ఖోఖో టీమ్(మెన్స్) ఆర్ఎస్​బీ బెంగుళూరు టీమ్ పై 27–-13 తేడాతో గెలిచి క్వార్టర్​  ఫైనల్​కు దూసుకెళ్లింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీఎస్​ఖోఖో స్పోర్ట్స్ మీట్​లో ఇప్పటికే తెలంగాణ మెన్స్​ టీమ్ కర్ణాటక, రాజస్థాన్ టీమ్స్ పై విజయకేతనం ఎగరవేసింది. తాజాగా ఆర్ఎస్​బీ బెంగుళూరు టీమ్​ను ఓడించి క్వాటర్స్​కు దూసుకెళ్లింది. తెలంగాణ టీమ్​కు కోచ్​గా కానుకుంట్ల స్వామి(సెక్షన్​ఆఫీసర్), మేనేజర్​గా టి.స్వర్ణ రాజ్ వ్యవహరిస్తున్నారు. – హైదరాబాద్​సిటీ, వెలుగు