ఎకో ఫ్రెండ్లీ గణేశుడి ఆన్ లైన్ క్విజ్ పోటీలు

ఎకో ఫ్రెండ్లీ గణేశుడి  ఆన్ లైన్ క్విజ్ పోటీలు

జీడిమెట్ల, వెలుగు: వినాయక ఉత్సవాలు పర్యావరణ హితంగా జరుపుకునేందుకు  రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పీసీబీ మెంబర్​ సెక్రటరీ కృష్ణ ఆదిత్య అన్నారు.  సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్​లోని పీసీబీ హెడ్డాఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిపై అవగాహన కోసం ఆన్​లైన్​ క్విజ్ పోటీలను శుక్రవారం ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజలకు, విద్యార్థులకు మట్టివినాయక విగ్రహాలు, పర్యావరణ పరిరక్షణ, పండగపై అవగాహన కోసం ఈ క్విజ్ ​పోటీలను ఏర్పాటు చేశామన్నారు.  ఇందుకోసం www.tspcb.cgg.gov.in <http://www.tspcb.cgg.gov.in> వెబ్​సైట్​లోకి వెళ్లి క్విజ్ పోటీల్లో పాల్గొనాలని సూచించారు.  మొత్తం రూ.10 లక్షల బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.  

ALSO READ :ఏక్‌‌‌‌ ధమ్.. ఏక్‌‌‌‌ ధమ్ .. టైగర్‌‌‌‌‌‌‌‌ నాగేశ్వరరావు నుంచి కొత్త సాంగ్

ప్రతి జిల్లాకు రూ.10 వేలు మొదటి బహుమతి, రూ.5 వేలు రెండో బహుమతి, మూడో బహుమతి రూ.3వేలు అందజేస్తామని చెప్పారు.  ఈ క్విజ్​ పోటీలు సెప్టెంబర్​1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు  ఉంటాయని వివరించారు.  రాష్ట్రవ్యాప్తంగా పండగ సందర్భంగా 2  లక్షల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో  సీనియర్​ సోషల్ ​సైంటిస్టు డా. ప్రసన్న కుమార్​, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.