
తెలంగాణ రేపు (ఫిబ్రవరి 25) రెండు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ తదితర విభాగాల్లో డిప్లమా ఎంట్రెన్స్ కొరకు TG ECET నోటిఫికేన్ విడుదల చేయనున్నారు. మార్చి 3 నుండి ఏప్రిల్ 19 వరకు అప్లికేషన్ ల స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మే 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
రేపు (ఫిబ్రవరి 25) లా సెట్ నోటిఫికేషన్ విడుదల :
ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే తెలంగాణ లాసెట్-2025 నోటిఫికేషన్ కూడా రేపు వెలువడనుంది. మార్చి1 నుండి ఆన్ లైన్ అప్లికేషన్ లు స్వీకరిస్తారు. అప్లికేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 15.
లేట్ ఫీజ్ రూ.500 ఫైన్ తో ఏప్రిల్ 25 వరకు అప్లై చేయవచ్చు.
వెయ్యి రూపాయల ఫైన్ తో మే 5 వరకు
రూ.2 వేల ఫైన్ తో మే 15 వరకు
రూ.4 వేల ఫైన్ తో మే 25 వరకు అప్లై చేసుకోవచ్చు.
జూన్ 6న ప్రవేశ పరీక్ష ఉంటుంది.
మరిన్ని వివరాలకు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో చూడగలరు.