- స్పోర్ట్స్ వర్సిటీ, యూనివర్సిటీల సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులు పాస్
హైదరాబాద్, వెలుగు: శాసన మండలిలో బుధవారం మూడు బిల్లులు ఆమోదం పొందాయి. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీల సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులు పాస్ అయ్యాయి. ఈ బిల్లులు ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందాయి. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ యూనివర్సిటీల సవరణ బిల్లు తెచ్చారు. స్పోర్ట్స్ వర్సిటీ బిల్లును మంత్రి కొండా సురేఖ, మహిళా వర్సిటీ పేరు మార్పు బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుల్లో చిన్న చిన్న సవరణలు సూచిస్తూ, ప్రతిపక్ష ఎమ్మెల్సీలు స్వాగతించారు. దీంతో బిల్లులు ఆమోదం పొందినట్టు మండలి చైర్మన్గుత్తా సుఖేందర్రెడ్డి ప్రకటించారు. అనంతరం టూరిజం పాలసీపై చర్చ కొనసాగింది. తర్వాత మండలిని గురువారానికి వాయిదా వేశారు.
మేం చేయాల్సిన పని కాంగ్రెస్ చేసింది: గోరటి వెంకన్న
మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. తాము(బీఆర్ఎస్) చేయాల్సిన పని కాంగ్రెస్చేసిందని అన్నారు.