హైదరాబాద్, వెలుగు: సిడ్నీలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) కాన్ఫరెన్స్ కోసం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐసీసీ)కు తెలంగాణ లేజిస్లేచర్ బృందం చేరుకున్నది. తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డా నరసింహ చార్యులు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సోమవారం పూర్తి చేశారు.
కాన్ఫరెన్స్ కు సంబంధించిన మెటిరియల్, సమాచారాన్ని సీపీఏ ప్రతినిధులు తెలంగాణ బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ, శాసనమండలి పని తీరు, నిర్వహణపై తెలంగాణ బృందం, సీపీఏ ప్రతినిధుల మధ్య చర్చ జరిగింది. ఈనెల 5,6,7 తేదీల్లో సీపీఏ కాన్ఫరెన్స్ జరగనున్నది.