ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్: కృష్ణా, తుంగభద్ర నదులపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై మాటల యుద్ధం ప్రారంభించిన తెలంగాణ.. ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఏపీతో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు రెండు రోజులుగా ప్రకటనలు చేస్తున్న మంత్రుల తీరుతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి సెగలు పుట్టిస్తుండగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. 
తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ వద్ద కుడి కాలువను, కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద అక్రమంగా.. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా దీనిపై వీ6, వెలుగు ప్రత్యేక కథనాలు ప్రసారం చేసినా.. ప్రచురించినా పట్టించుకోని సర్కార్.. హుజూరాబాద్ ఉప ఎన్నిక రానున్న నేపధ్యంలో స్పందిస్తోంది. ఉత్తుత్తి మాటలేనన్న ప్రతిపక్షాల విమర్శల నేపధ్యంలో మంగళవారం కృష్ణా బోర్డుకు లేఖ రాయడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శఆకా ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ కృష్ణా బోర్డుకు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై లేఖ రాసి ఫిర్యాదు చేశారు. లేఖతోపాటు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల ఫోటోలను కూడా జత చేసినట్లు సమాచారం.