ఆంధ్రాలో తెలంగాణ మద్యం పట్టివేత

భద్రాచలం,వెలుగు: కరోనా వేళ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తెలంగాణలోని కొందరు మద్యం వ్యాపారులు ఇతర మండలాలకు తరలిస్తుండగా ఆంధ్రా సరిహద్దుల్లో సోమవారం సాయంత్రం పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే…చర్ల మండలం నుంచి భద్రాచలం వైపుగా వస్తున్న ఓ కారును విలీన మండలం ఎటపాకలోని కన్నాయిగూడెం చెక్‍పోస్టు వద్ద ఆంధ్రా పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. అందులో సుమారు రూ.లక్ష విలువైన మద్యం ఉన్నట్లు గుర్తించి భద్రాచలంకు చెందిన మద్యం వ్యాపారి, కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.

రూ.74 వేల మద్యం స్వాధీనం
హసన్ పర్తి, వెలుగు: అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న బెల్టుషాపుపై సోమవారం హసన్ పర్తిపోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ పర్తి మండల కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన ముస్కు ఉమ తన ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వచేసి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి రూ .74,600 విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉమపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

For More News…

లాక్ డౌన్ ఉండాల్సిందే