తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈనెల 16న నోటిఫికేషన్ జారీ కానుంది. డిసెంబర్ 10న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 14న  కౌంటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దాఖలైన నామినేషన్లను ఈనెల 17న పరిశీలించనున్నారు. ఈనెల 22 మధ్యాహ్నం 3 గంటలవ రకు నామినేషన్ల ఉపసంహరణకు గుడువు విధించారు. మరోవైపు ఏపీలో 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ప్రస్తుత సభ్యుల పదవి కాలం ముగియనుంది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో స్థానం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.