Latest Weather Report: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు .. పెరుగుతున్న చలి

Latest Weather Report: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు ..  పెరుగుతున్న చలి

తెలుగురాష్ట్రాల్లో  రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.  తెలంగాణలో తేమగాలులు వీయడంతో చలి పెరిగింది. ఉష్ణోగ్రతలు  తగ్గుతున్నాయి.  హైదరాబాద్​ లో సాధారణం కన్న తక్కువుగా నమోదవుతున్నాయి.  పొగమంచు దట్టంగా పడుతుంది.   హైవేలపై ప్రయాణం చేసేవారు  అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.

తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎకువగా ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడు భారీ పొగ మంచు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.   కొన్నిచోట్ల రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల వరకూ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. 

పగటి వేళ కూడా అత్యల్పంగా 20 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ఆస్తమా, ఫ్లూ వంటి వైరస్‌ వ్యాప్తి ఎకువగా ఉంటుందన్నారు. ఉదయం, రాత్రి వేళల్లో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. ఉన్ని దుస్తులు ధరించాలని, పిల్లలు, వృద్ధులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.