అగ్రికల్చర్ ఆఫీసర్​ను విధుల్లోంచి తొలగించాలి

అగ్రికల్చర్ ఆఫీసర్​ను విధుల్లోంచి తొలగించాలి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పుల్లయ్యను వెంటనే విధుల్లోంచి తొలగించాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు సకాలంలో తెప్పించడంలో అగ్రికల్చర్ ఆఫీసర్ విఫలమయ్యారని అన్నారు.విత్తన డీలర్లు యథేచ్ఛగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నప్పటికీ.. వారిని నివారించడంలో జిల్లా అధికారి నిర్లక్ష్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్క రాందాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్, ఉపాధ్యక్షుడు గంగాధర్, అశోక్, గజ్జల విలాస్ పాల్గొన్నారు.