ఒకటి.. రెండు కాదు..సిక్సర్​ : ఆరు జాబ్​లు సాధించాడు

2019లోనే వీఆర్‌‌వో, గ్రూప్‌–4, జూనియర్ పంచాయతీ సెక్రటరీ కొట్టగా.. అంతకుముందు రైల్వే సెక్టార్‌‌లో గ్రూప్‌–డి, అసిస్టెంట్ లోకోపైలట్‌ జాబ్‌లను సాధించాడు. తాజాగా ప్రకటించిన పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో సివిల్ ఎస్సైగా సెలెక్టయి తనను తాను ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు.. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్‌‌–1 కంప్లీట్ చేసి టైర్‌‌–2 కోసం ప్రిపేరవుతున్నాడు..

ఇప్పటివరకు ఏ ఎగ్జామ్ కోసం నేను కోచింగ్ తీసుకోలేదు. నాతో పాటు ఉన్న సీనియర్లు గైడ్ చేస్తుంటే దాని ప్రకారం చదివా. బేసిక్స్ నేర్చుకుంటే సరిపోదు చదివే ఏ విషయాన్నైనా లోతుగా తెలుసుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో కరెంట్ ఎఫైర్స్ చాలా కీలకం. వాటిని లింక్ చేస్తూ చదివితే చాలా సబ్జెక్టులు కవర్ అవుతాయి. మ్యాథ్స్ మాత్రం ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. టెక్నాలజీని బాగా వాడుకోవాలి. ఏదైనా ప్రాబ్లమ్ తెలియకుంటే యూట్యూబ్‌లో చూడొచ్చు. బోలెడన్నీ వీడియోస్ ఉన్నాయి.

పుట్టింది, టెన్త్ వరకు చదువుకున్నది వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లిలో.. అమ్మ రమాదేవి, నాన్న తిరుపతి ఇద్దరూ వ్యవసాయం చేస్తుంటారు. కొండగట్టు జేఎన్‌టీయూలో బీటెక్‌(ఈఈఈ) కంప్లీట్ చేశా. 2017లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చా. అఫ్జల్ గంజ్‌ లైబ్రరీలో డైలీ 8 నుంచి 10 గంటలు చదివేవాణ్ని. ఎల్‌బీ నగర్‌‌ నుంచి అఫ్జల్‌గంజ్‌కు రోజూ బస్‌లో అప్ అండ్ డౌన్ చేశా. వన్ ఇయర్ ఇదే పని మార్నింగ్ 7గంటలకు వెళ్తే నైట్ 7.30కి తిరిగి రిటర్న్ అయ్యేవాడిని. నేను రాసిన పరీక్షల్లో ఒక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తప్ప అన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేశా. యూనిఫాం జాబ్ చేయాలనేది నా డ్రీం. అందుకే సివిల్ ఎస్సై వచ్చినా.. సీజీఎల్ టైర్‌‌–2 ప్రిపేరవుతున్నా..  కస్టమ్స్ ఆఫీసర్‌‌గా వైట్ అండ్ వైట్‌లో నన్ను నేను చూసుకోవాలని.