సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. ఆత్మహత్యకు యత్నం

సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. ఆత్మహత్యకు యత్నం
  • పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు 
  • ఆసిఫాబాద్​ జిల్లా బోదంపల్లిలో ఘటన 
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్  

కాగజ్ నగర్, వెలుగు : ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆసిఫాబాద్​జిల్లా కౌటాల మండలం బోదంపల్లికి చెందిన కర్నె వెంకటేశ్ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకోవడం ఆదివారం కలకలం రేపింది. అతడి తండ్రి మృతి చెందగా తల్లి సత్యక్క, సోదరుడు రాజశేఖర్ తో కలిసి నివసిస్తున్నాడు. స్థానికంగా వెంకటేశ్ ఆటో నడుపుతుంటాడు.

 శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వెంకటేశ్ ను కుటుంబీకులు, గ్రామస్తులు ఈస్ గాం బెంగాలీ క్యాంప్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా చికిత్సపొందుతున్నాడు. సూసైడ్ చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా.. కుటుంబ కలహాలు, లేదంటే  ప్రేమ వ్యవహారం అయి ఉండొచ్చని అనుమానిస్తుండగా.. దీనిపై పోలీసులు స్పందించలేదు.