సౌదీ ఎడారిలో : GPS కట్ అయ్యి తెలంగాణ యువకుడు మృతి

హైదరాబాద్: సౌదీ అరేబియాలోని ఏడారిలో చిక్కుకుని తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఫ్రెండ్ తో  కలిసి బయటకు వెళ్లినప్పుడు సడెన్ గా  జీపీఎస్ కట్ కావడం.. ఫోన్ స్విచ్ఛాఫ్  కావడంతో ఫ్రెండ్ తో కలిసి ఏడారిలోనే  చిక్కుకుపోయాడు.  నాలుగు రోజులు తిండి లేక, నీళ్లు లేక అతడితో పాటు అతని స్నేహితుడు కూడా మరణించారు.  

అసలేం జరిగిందంటే.. 

కరీంనగర్ కు చెందిన మహ్మద్ షాజాద్ ఖాన్ ( 27 ఏళ్లు) గత మూడు సంవత్సరాలుగా  సౌదీలోని టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.   ఆగస్టు 19న  షాజాద్  సూడానీస్ అనే తన  సహోద్యోగితో  సౌదీలోని రుబ్ అల్ ఖలీ ఓ చోటకు వెళ్లారు. సడెన్ గా   జీపీఎస్ సిగ్నల్ రావడం ఆగిపోయింది. కారులో పెట్రోల్ కూడా అయిపోయింది. ఫోన్ కూడా స్విచ్ఛాప్ కావడంతో  నాలుగు రోజులు ఏడారిలోనే చిక్కిపోయారు. విపరీతమైన ఎండ వేడి, ఫుడ్, నీళ్లు లేక వాళ్లిద్దరు అక్కడే మరణించారు. ఆగస్టు 22న కారు పక్కన ఇసుక తిన్నెలలో  వాళ్ల మృతదేహాలను గుర్తించారు. సౌదీలో  విపరీతమైన ఎండ వేడికి  ఈ ఏడాది హజ్ యాత్రికులు పెద్ద సంఖ్యలో మరణించారు.