- సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో
నస్పూర్, వెలుగు: స్టాక్మార్కెట్లో నష్టాలు రావడం, లోన్యాప్స్నిర్వాహకుల వేధింపులతో మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అరుణక్క నగర్ కాలనీకి చెందిన నమ్తబాజీ శ్రీకాంత్(29) కొన్నేండ్లుగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్చేస్తున్నాడు. ఇందుకు లోన్ యాప్స్‌లో అప్పు తీసుకున్నాడు.
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో నష్టాలు రావడంతో లోన్ యాప్స్ లో తీసుకున్న అప్పులు చెల్లించలేదు. దీంతో వారు అప్పు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ‘స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో నష్టపోయాను. లోన్ యాప్స్ లో, తెలిసిన వారి నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక సూసైడ్ చేసుకుంటున్నాను’ అని శుక్రవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకున్న శ్రీకాంత్ అనంతరం ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య శ్రుతి, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. శ్రుతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామనిశ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.