ఇటలీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లారెడ్డిపేట వాసి..

ఇటలీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లారెడ్డిపేట వాసి..

ఎల్లారెడ్డిపేట: బతుకుదెరువు కోసం ఇటలీ వెళ్లిన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన మహమ్మద్ రషీద్(47) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటలీ పక్కనే ఉన్న పోలాండ్ కు 6 నెలల కింద గూడ్స్  వెహికిల్ పై డ్రైవింగ్  చేసేందుకు వెళ్లాడు. గత నెలలో ఇటలీ దేశం ట్రక్కుతో గూడ్స్ ను తీసుకెళ్లి అన్ లోడ్  చేసి తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో స్నానం కోసం ఓ హోటల్  వద్ద ఆగాడు.

కామారెడ్డికి చెందిన వ్యక్తితో కలిసి క్రాస్  చేస్తున్న సమయంలో అటుగా స్పీడ్ గా వస్తున్న భారీ ట్రక్ ను గమనించి పక్కనున్న వ్యక్తిని తోసేసే క్రమంలో రషీద్  ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. డెడ్ బాడీ మంగళవారం రాత్రి వరకు చేరుకుంటుందని తెలిపారు. కాగా, వీరి ఫ్యామిలీ కొన్నేండ్లుగా సిద్దిపేటలో ఉంటోంది. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.