- మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
బషీర్ బాగ్, వెలుగు: ప్రభుత్వ నిబంధనల మేరకు సొసైటీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి జాగా అందుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా కలుకూరి రాములు సోమవారం బషీర్ బాగ్ యూనియన్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు.
హెచ్ యూజే అధ్యక్షుడు శిగా శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కొందరు జర్నలిస్టులు తాము ఎలాంటి హౌసింగ్ సొసైటీల్లో సభ్యులుగా లేమని, తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరి నుంచి సొసైటీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు.
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, స్టీరింగ్ కమిటీ మెంబర్స్మాజిద్, రాష్ట్ర ట్రెజరర్మోతే వెంకట్ రెడ్డి, కార్యదర్శి యాదగిరి, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రవి కాంత్ రెడ్డి, హెచ్ యూజే ప్రధాన కార్యదర్శి షౌకత్, యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.ఎన్. హరి, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు గౌడ్, హరీశ్పాల్గొన్నారు.