అచ్చంపేట/కల్వకుర్తి, వెలుగు : అచ్చంపేట సివిల్హాస్పిటల్ లో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులకు సరైన సేవలు అందకపోవడంపై తెలంగాణ మెడికల్సర్వీసెస్అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్డెవలప్మెంట్కార్పొరేషన్చైర్మన్ఎర్రోళ్ల శ్రీనివాస్ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేట సివిల్హాస్పిటల్ ను విప్గువ్వల బాల్రాజ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో మందుల వివరాలు, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
హాస్పిటల్నిర్వహణపై సూపరింటెండెంట్ప్రభుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో బెడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో సిబ్బందిపై మండిపడ్డారు. హాస్పిటల్లో 59 రకాల మందులు ఉండగా కొన్ని మాత్రమే రాయడం ఏమిటని ప్రశ్నించారు. తర్వాత రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళకు కేసీఆర్కిట్ అందజేశారు. అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ సుధాకర్లాల్, మున్సిపల్చైర్మన్నర్సింహాగౌడ్, జడ్పీటీసీ మంత్ర్యానాయక్, బల్మూర్ఎంపీపీ అరుణ తదితరులు ఉన్నారు.