ఫ్యూచర్ సిటీలో.. 200 ఎకరాల్లో AI సిటీ : బడ్జెట్ లో రూ.774 కోట్లు

ఫ్యూచర్ సిటీలో.. 200 ఎకరాల్లో AI సిటీ : బడ్జెట్ లో రూ.774 కోట్లు

బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ యుగానికి తగ్గట్టు కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీని నిర్మించనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 

ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో నిర్మించనున్న AI సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుందన్నారు. ఈ ఏఐ సిటీలో గూగుల్ కంపెనీ తన AI ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారాయన. ఈ ఏఐ సిటీ కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు బడ్జెట్ లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారాయన.

ALSO READ : పేరంట్స్ కు హ్యాపీ : 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. 11 వేల 600 కోట్ల నిధులు

సేవా రంగంలో అభివృద్ధికి దోహదపడే సానుకూల ప్రభుత్వ కీలక నిర్ణయాల ఫలితంగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో గత సంవత్సర కాలంగా ఎంతో అభివృద్ధి చెందిందని.. కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ వంటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక ప్రక్రియల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి భట్టి విక్రమార్క.