![నేషనల్ గేమ్స్‌లో టీటీ జట్టుకు కాంస్యం](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-mens-table-tennis-team-won-bronze-medal-at-national-games_RSPt8470uZ.jpg)
డెహ్రాడూన్ : నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ మెన్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ కాంస్య పతకం గెలిచింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్, స్వర్ణేందు చౌదరి, మహమ్మద్ అలీతో కూడిన తెలంగాణ టీమ్ 0–-3తో మహారాష్ట్ర చేతిలో ఓడి కంచు పతకంతో తిరిగొచ్చింది.
అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో తెలంగాణ 3–-2తో ఉత్తర్ ప్రదేశ్‌పై గెలిచింది. విమెన్స్ 200 మీటర్ల ఈవెంట్‌లో గాదె నిత్య ఫైనల్‌కు అర్హత సాధించింది.ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో నిషికా అగర్వాల్, సురభి ప్రసన్న ఫైనల్ చేరారు.