వనపర్తి టౌన్, వెలుగు: పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి బిల్లులు, నెల జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బిల్లులు చెల్లించేంత వరకు ఆందోళన చేస్తామన్నారు. అనంతరం ఇన్చార్జి డీఈవో నరహరికి వినతిపత్రం అందజేశారు. గోవిందమ్మ, గణేశ్, దేవమ్మ, సంధ్య, బాలమ్మ, వెంకటమ్మ, భారతమ్మ, హేమలత, బాలేశ్వరి పాల్గొన్నారు.
మరికల్: సర్కారు బడుల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు కాశన్న డిమాండ్ చేశారు. ఎమ్మార్సీ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు.