- వేల్పూర్,కమ్మర్ పల్లి ఏఎంసీ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో ఈరవత్రి అనిల్
బాల్కొండ, వెలుగు: బాల్కొండ సెగ్మెంట్ లో వర్గపోరు తారాస్థాయికి చేరిందని, ప్రోత్సహిస్తే సహించేది లేదని తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ హెచ్చరించారు. సోమవారం వేల్పూర్, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. పదేళ్లుగా జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, నూతన చైర్మన్లు నియమిస్తున్నామని అన్నారు. రైతులు లాభసాటి పంటలను పండించే విధంగా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్లు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సెగ్మెంట్ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్, చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, అన్వేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు కొత్తింటి ముత్యం రెడ్డి, నాగపూర్ నర్సయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు.