తెలంగాణ పేరే ఎత్తలే

  • ఆర్థిక మంత్రి నిర్మల తీరుపై పొన్నం అసహనం


హైదరాబాద్: లోక్ సభలో మోదీ అనేక సార్లు తెలంగాణ ఏర్పాటు పట్ల విషం కక్కారని, ఇప్పుడు కూడా తెలంగాణకు బడ్జెట్ లో గుండు సున్నాతప్పా.. రూపాయి కూడా ఇవ్వలేని మంత్రి పొన్నం  ప్రభాకర్ అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీపై పలు విమర్శలు చేశారు. మేము ఇచ్చిన అంశాలను కేంద్రం పరిగణన లోకి తీసుకోలేదని, నిర్మల సీతారామన్ గారి 2 గంటల ప్రసంగంలో కనీసం తెలంగాణ అనే పదం కూడా ఎత్తలేదని మండిపడ్డారు. 

అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో చెప్పినట్టు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు కేటాయించారు. మరి ఇప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణకు ఎందుకు అన్యాయం చేశారని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి నిర్మిస్తున్నారని, తెలంగాణలోని ఒక్క ప్రాజెక్ట్ కూడా   జాతీయ హోదా  ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రానికి గుండు సున్నా అంటే ఇది తీరని అన్యాయమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:-పీసీసీ రేసులో లేను

 మూసి ప్రక్షాళనకు నిధులు కేటాయించాలని వేడుకున్న ఒక్క రూపాయి ఇవ్వలేదుని, ఇతర రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి గంగానది ప్రక్షాళనకు వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్ పేట నుండి మూసి నది పోతుంది అయినా ఒక్క రూపాయి అయినా కేటాయించారా..? అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.