బండి సంజయ్‌ను పట్టించుకునే పరిస్థితి లేేదు

బండి సంజయ్‌ను పట్టించుకునే పరిస్థితి లేేదు

శివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి శివాలయాల్లో సతీసమేతంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడారు. బండి సంజయ్ పాదయాత్ర కాశీ యాత్రే అవుతుందన్నారు మంత్రి. తెలంగాణాకు బీజేపీ పార్టీ ఎం చేశారని ప్రజల్లోకి వెళ్తారన్నారు. 2014 కు ముందు ఏంటి ఇప్పటి పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు జగదీశ్ రెడ్డి. ఢిల్లీ కోట నుండి బీజేపీ ని తరిమెందుకే అన్ని రాష్ట్రాల యాత్రలన్ని ఢిల్లీ వైపు సాగుతున్నాయన్నారు.

రాష్ట్ర ప్రజలు బీజేపీ బండి సంజయ్ ని పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందన్నారు. తెలంగాణాకు కేంద్రం ఏం చేసిందని సంజయ్ ప్రజలకు చెప్పి యాత్రలు చేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణా లాంటి పథకాలు ఉన్నాయా ? అంటూ మంత్రి ప్రశ్నించారు. పెంచిన పెట్రోల్ , గ్యాస్ రేట్లు గురించి చెబుతారా అంబానీ , ఆదాని లు బాగుపడ్డారని చెబుతారా? అంటూ ఎద్దేవా చేశారు మంత్రి. తెలంగాణకు కేసీఆర్ ని మించి మోడీ ఏంచేశారో పాదయాత్రలో చెప్పాలన్నారు. బీజేపీ ఆటలు ఇంకా దేశంలో చెల్లవన్నారు జగదీశ్ రెడ్డి. ఢిల్లీ నుండే బీజేపీని బయటకు తరముతుంటే ఇంకా కొత్త రాష్ట్రాల్లో అధికారం ఎక్కడి నుండి వస్తుందని ఎద్దేవా చేశారు మంత్రి.

ఇవి కూడా చదవండి:

భోళా శంకరుడి ఫొటో గ్యాలరీ

సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం