మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా

నల్లగొండ : దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సోమవారం ఒక్కరోజే 1,825 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 15 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. సాధారణ ప్రజలతోపాటు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మి, మహేశ్ బాబు, బండ్ల గణేశ్, థమన్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైరస్ బారిన పడ్డారు. తాజాగా రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డికి కొవిడ్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలసిన వారిని పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. 

మరిన్ని వార్తల కోసం:

ఖాకీ డ్రెస్​లో కాశీ కాల భైరవుడు

సీఎం అయ్యే అర్హత బీసీలకు లేదా?

పట్టాలపై కూలిన ఫ్లైట్.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన