వన్యప్రాణులను దత్తత తీసుకున్న మంత్రి

వన్యప్రాణులను దత్తత తీసుకున్న మంత్రి

హనుమకొండ సిటీ, వెలుగు: వన్యప్రాణులపై మక్కువతో రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ దత్తత తీసుకున్నారు. మంగళవారం క్యాంపు ఆఫీసులో జూ అధికారితో మాట్లాడి వాటికి నిర్వహణకు అయ్యే రూ. 2 లక్షలు మంత్రి చెల్లించారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్కులో ఒక సాంబర్ డీర్, ఒక చౌసింగా, ఒక అడవిదున్నను ఏడాది పాటు మంత్రి దత్తత తీసుకున్నారు.