ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కొండా సురేఖ

ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కొండా సురేఖ

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు  తెలిపారు మంత్రి కొండా సురేఖ. ఇటీవల  టీటీడీ దర్శనాల విషయంలో  మంత్రి కొండా సురేఖ  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.  

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ అనమతించేలా చూడాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కొండా సురేఖ విజ్ఞప్తికి సానుకూలంగా  స్పందించిన ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు అనమతిస్తున్నట్లు ప్రకటించింది.  మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రనిధుల లేఖలకు వీఐపీ దర్శనాలు కల్పించనుంది టీటీడీ. ఈ క్రమంలో ఏపీ నిర్ణయంపై కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. 

ALSO READ | తెలంగాణ గోవిందం : ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు తిరుమలలో ప్రత్యేక దర్శనం