
- అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: దుబాయ్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్యను ఆదుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన చొప్పరి లింగయ్య దుబాయ్‌లో చిక్కుకున్నానని తనకు సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ లకు విజ్ఞప్తి చేస్తూ ఇటీవల ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.
దీనికి స్పందించిన మంత్రి పొన్నం ఈ విషయాన్ని ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ డా. బీఎం వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దుబాయ్‌లోని సామాజిక సేవకులు సుతారి సత్యం పటేల్ ను సంప్రదించి లింగయ్యకు అవసరమైన సహాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ సాయంతో లింగయ్యను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు.