గండిపేట, వెలుగు: వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మహిళా రైతులు కూర్చోవడానికి ప్రత్యేక గ్యాలరీలు ఉంటాయ్నారు. వ్యవసాయ కార్యదర్శి ఏపీసీ ఎం.రఘునందన్‌రావు, కమిషనర్ బి.గోపితో కలిసి గురువారం ఆయన రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆడిటోరియంను పరిశీలించారు.
అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. గవర్నర్, వ్యవసాయ విశ్వవిద్యాలయ చాన్స్లర్జిష్ణుదేవ్శర్మ, సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన, ప్రసంగ కార్యక్రమాల్లో సమయపాలన పాటించాలని అధికారులకు సూచించారు.